![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1063 లో.. వెంకి ఫుడ్ డెలివరి చేసి అలసిపోతాడు. భోజనం చేద్దాం అనేసరికి తను తెచ్చుకున్న భోజనం పాడవుతుంది. దాంతో వాటర్ తో సరిపెట్టుకుంటాడు. అప్పుడే నందు వస్తుంది. నా వల్లే కదా ఇన్ని కష్టాలు పడుతున్నావని నందు అంటుంది. నువ్వేం చేసావ్.. జాబ్ చూసి మంచి పని చేసావ్.. నేనే నీకు థాంక్స్ చెప్పాలని వెంకీ అంటాడు. మరొకవైపు ఇందు సీఈఓ అయిందని తెలియడానికి పార్టీ ఏర్పాటు చేస్తారు.
పార్టీలో సీతారామయ్య ఫోటో పెడుతారు. అది రేఖ చూసి ఎవరు ఆ ఫోటో పెట్టారని కోప్పడుతుంది. ఫోటో తీసెయ్యబోతుంటే ఆగండి అని రాజు ఎంట్రీ ఇస్తాడు. ఆ ఫోటో పెట్టించింది మనమే అని రాజు అంటాడు. అవును కానీ ఎందుకు అలా చేసావని రేఖ అడుగుతుంది. ఇప్పుడు ఇది తీసెయ్యండి అని కోప్పడుతుంది. అసలు మీకు బిజినెస్ రాదు పిన్ని అని రాజు అనగానే ఏం మాట్లాడుతున్నావని రేఖ కోప్పడుతుంది. ఇప్పుడు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టె క్లయింట్స్ అందరు కూడా సీతారామయ్య గారిని చూసే కదా పెట్టేది.. మరి అలాంటప్పుడు ఆయన ఫోటో లేకుండా ఎలా.. ఇప్పుడు తన ఫోటో చూసి అందరూ క్లయింట్స్ వస్తారని రాజు అంటాడు. దానికి రేఖ కూల్ అవుతుంది. ఆ తర్వాత చాలా మంచి పని చేసావ్ రాజు ఇన్నాళ్లుగా నా వాళ్ల జ్ఞాపకాలు కూడా లేకుండా చేసింది ఆ రేఖ అని రాజుతో అపర్ణ అంటుంది.
మరొకవైపు రేఖ తరుపు క్లయింట్స్ ఏం మాట్లాడుకుంటున్నారని ఇందు వాళ్ళ మాటలు వింటుంది. మరొకవైపు రాజు కొంతమంది క్లయింట్స్ ఏం అనుకుంటున్నారని వాళ్లతో మాట్లాడతాడు. మీరు అచ్చం రాజ్ లాగా ఉన్నారని క్లయింట్స్ అంటారు. నేను ఇందు భర్తని అని రాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |